మెట్రో నగరాల్లో మహిళల కోసం పింక్ బస్సులు: కేంద్ర మంత్రి గడ్కరీ వెల్లడి
- మహిళల భద్రత కోసం తగిన చర్యలు తీసుకుంటున్నాం
- ఎలక్ట్రిక్ టూవీలర్లు, త్రీవీలర్లకు పర్మిట్ల నుంచి మినహాయింపు
- కొత్త బస్సుల్లో ప్యానిక్ బటన్, సీసీ కెమెరాలు తప్పనిసరి
దేశంలో కోటికిపైగా జనాభా ఉన్న అన్ని మెట్రో నగరాల్లో మహిళల కోసం ప్రత్యేకంగా పింక్ బస్సులను ప్రవేశపెట్టనున్నట్టు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. ప్రజా రవాణా వ్యవస్థలో మహిళల భద్రతకు సంబంధించి లోక్ సభలో కొందరు ఎంపీలు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. ఇందుకు సంబంధించి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.